school: స్కూలు వాష్‌రూమ్‌లో బాలుడి దారుణ హత్య.. మృతదేహంపై 10 కత్తి పోట్లు

  • గుజరాత్‌లోని వడోదరలో ఘటన
  • దర్యాప్తు చేపట్టిన పోలీసులు
  • స్కూలుకి సమీపంలో పదునైన ఆయుధం లభ్యం 

గుజరాత్‌ లోని వడోదరలోని ఓ పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందులో తొమ్మిదో తరగతి చదువుతోన్న ఓ బాలుడు వాష్‌రూమ్‌లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బాలుడి మృతదేహంపై 10 కత్తి పోట్లు ఉన్నాయని చెప్పారు.

దర్యాప్తులో భాగంగా స్కూలు పరిసరాలు పరిశీలించిన పోలీసులకి.. సమీపంలోని ఓ గుడి వద్ద ఓ స్కూల్‌ బ్యాగ్‌లో పదునైన ఆయుధం, ఓ బాటిల్‌లో కారం కలిపిన నీళ్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ విద్యార్థితో ఘర్షణ పడి అదే స్కూల్లో చదువుతోన్న మరో బాలుడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలో స్కూల్‌లోని సీసీ కెమెరాల ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో గుర్‌గావ్‌లో 7 ఏళ్ల బాలుడు ఇదే రీతిలో వాష్‌రూమ్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  

More Telugu News