nri: అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ టెక్కీ

  • మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్న రాఘవేంద్రరావు
  • అక్టోబర్ నుంచి కనపడకుండాపోయిన వైనం
  • సుష్మాస్వరాజ్ సాయం కోరిన అతని తండ్రి

హైదరాబాదుకు చెందిన రాఘవేంద్రరావు అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అమెరికాలో అదృశ్యమయ్యాడు. 36 ఏళ్ల వయసున్న అతను కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. గత ఏడాది అక్టోబర్ నుంచి అతను కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, తన కుమారుడి ఆచూకీ కనుక్కోవాలని అతని తండ్రి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కోరారు.

2011 నుంచి మైక్రోసాఫ్ట్ లో తన కుమారుడు పని చేస్తున్నాడని ఆయన తెలిపారు. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తమతో ఎప్పుడూ టచ్ లో ఉండేవాడని... గత అక్టోబర్ నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదని చెప్పారు. కుమారుడి ఆచూకీ తెలుసుకోవడంలో తమకు సాయం చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కూడా ఆయన కోరారు.

సుష్మాస్వరాజ్ కు రాసిన లేఖలో... "మా కుమారుడి జాడ తెలుసుకునేందుకు ఎంతో ప్రయత్నించి, విఫలమయ్యాను. అతను నాకున్న ఒక్కగానొక్క కొడుకు. మమ్మల్ని చూసుకోవడానికి మరెవరూ లేరు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లండన్ లో ఎంటెక్ పూర్తి చేసిన రాఘవేంద్రరావు ఆ తర్వాత అమెరికాకు వెళ్లాడు. 

More Telugu News