stock market: బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మాల దూకుడు.. దూసుకెళ్లిన సెన్సెక్స్

  • భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 257 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 10,822కు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ... మధ్యాహ్నం నుంచి లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా రంగాల షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 257 పాయింట్లు పెరిగి 35,690కి ఎగబాకింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 10,822 వద్ద స్థిర పడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ ట్రాన్స్ మిషన్ (6.36%), వక్రాంగీ (5.00%), ఐనాక్స్ విండ్ లిమిటెడ్ (4.97%), ఫ్యూచర్ రీటెయిల్ (4.51%), ఇండియా సిమెంట్స్ (4.46%).

టాప్ లూజర్స్:
శ్రీ రేణుకా షుగర్స్ (-6.23%), ఎస్ఆర్ఎఫ్ (-6.12%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్ (-5.07%), క్వాలిటీ (-4.91%), మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ (-4.40%).       

More Telugu News