Pawan Kalyan: ఏదో విధంగా పవన్‌ మద్దతు తీసుకుందామని వైసీపీ నేతలు అనుకుంటున్నారు: బోండా ఉమా

  • జగన్ చేస్తోన్న పాదయాత్రకు స్పందన రావట్లేదు
  • ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి
  • తమతో పవన్‌ పొత్తు పెట్టుకుంటారని వరప్రసాద్‌ అంటున్నారు
  • ఆ మాటను పవన్‌ కల్యాణ్‌ చెప్పాల్సిన అవసరం ఉంది

వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి చేస్తోన్న పాదయాత్రకు స్పందన రావట్లేదని, అలాగే ఆయనకు పరిపాలన అనుభవం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా గెలుపు సాధించాలని వైసీపీ మైండ్‌ గేమ్‌ ఆడుతోందని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి.. ఏదో విధంగా పవన్‌ కల్యాణ్‌ మద్దతు తీసుకుందామని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.

ఇప్పటికే బీజేపీతో కలిసి ముందుకు వెళుతున్నారు. బీజేపీ డైరెక్షన్‌లో వైసీపీ యాక్షన్‌ చేస్తోంది. తమతో పవన్‌ పొత్తు పెట్టుకుంటారని వైసీపీ నేత వరప్రసాద్‌ అంటున్నారు. నేను అడుగుతున్నాను.. ఆ మాటను పవన్‌ కల్యాణ్‌ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చెబితే అప్పుడు నిర్ధారణ అవుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా?  వద్దా? అనే విషయాన్ని పవన్‌ నిర్ణయించుకోవాలి.

పవన్‌కి కొందరు తప్పుడు సమాచారం ఇచ్చి పక్కదారి పట్టిస్తున్నారు. వైసీపీతో పవన్‌ వెళ్లాలని అనుకుంటే అరాచకం వైపు వెళుతున్నట్లు అనుకోవచ్చు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మేమే గెలుస్తాం. వైసీపీ నేతలు మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఏ ప్రాజెక్టులోనయినా అవినీతి జరిగిందని నిరూపించండి" అన్నారు.

More Telugu News