brian krzanich: ఉద్యోగినితో అక్రమ సంబంధం.. ఉద్యోగం కోల్పోయిన ఇంటెల్ సీఈవో!

  • ఉద్యోగానికి రాజీనామా చేసిన బ్రియాన్ జానిచ్
  • 1982లో ఇంటెల్ లో చేరి, సీఈవో వరకు ఎదిగిన బ్రియాన్
  • ఉద్యోగినితో సంబంధం కారణంగా అవమానభారంతో వైదొలగిన సీఈవో

ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఇంటెల్ సీఈవో బ్రియాన్ జానిచ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో గతంలో ఆయనకు సంబంధం ఉండటమే దీనికి కారణం. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ బ్రియాన్ రాజీనామాను కోరడం వల్లే ఆయన రిజైన్ చేశారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఆయనతో సంబంధం కలిగిన మహిళ పేరును వెల్లడించడానికి మాత్రం వారు నిరాకరించారు. జానిచ్ రాజీనామా నేపథ్యంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాబ్ స్వాన్ తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారు.

1982లో ఇంటెల్ లో ఇంజినీర్ గా చేరిన జానిచ్... అంచలంచెలుగా ఎదిగి 2013లో సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు సీఎఫ్ఓగా కూడా పని చేశారు. అయితే, సహ ఉద్యోగినితో సంబంధం పెట్టుకోవడంతో... అవమానభారంతో కంపెనీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరోవైపు, ఎంతో సమర్థత కలిగిన జానిచ్ రాజీనామాతో ఇంటెల్ లో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

More Telugu News