kajol: కాలు జారి పడిపోయిన బాలీవుడ్ భామ కాజోల్... ముంబైలో ఓ మాల్ లో ఘటన!

  • కాలు పట్టు తప్పి వెనక్కు పడిపోయిన కాజోల్
  • బాడీ గార్డు సాయంతో తిరిగి పైకి
  • దిల్ వాలే సినిమా ట్రైలర్ సమయంలోనూ ఇదే విధమైన ఘటన

బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ముంబైలోని ఓ మాల్ లో కాలు జారి పడిపోయింది. ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్లో హెల్త్ అండ్ గ్లో స్టోర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మోకాలు పొడవు ఉన్న తెల్లటి డ్రెస్ తో ఆమె కార్యక్రమానికి వెళ్లింది. ఎస్కలేటర్ దిగి ఫ్లోర్ లో నడుస్తున్న సమయంలో, మరొక మహిళతో మాట్లాడుతూ కాజోల్ ఉన్నట్టుండి వెనక్కు పడిపోయింది.

ఒక బాడీగార్డు సాయంతో తిరిగి పైకి లేచింది. ఈ ఘటనలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టేశారు. 2015లో ‘దిల్ వాలే’ సినిమా ట్రైలర్ విడుదల సమయంలోనూ కాజోల్ ఇదే విధంగా కాలు జారి పడిపోతున్న క్రమంలో సహ నటుడు వరుణ్ ధావన్ రెండు చేతులతో పట్టుకుని కాపాడాడు. ఆ సమయంలో కాజోల్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

More Telugu News