chaitu: అక్కినేని హీరో మంచి హిట్ మిస్సయ్యాడు

  • 'సమ్మోహనం'తో హిట్ కొట్టిన ఇంద్రగంటి 
  • అంతకుముందు లైన్ విన్న చైతూ 
  • అప్పటికే కమిటైన సినిమాలతో బిజీ

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా చేసిన 'సమ్మోహనం' .. విడుదలైన రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటు ఇంద్రగంటి కెరియర్లోను .. అటు సుధీర్ బాబు కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నాగచైతన్య వదులుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

ఆ మధ్య ఇంద్రగంటి మోహనకృష్ణ .. నాగచైతన్యకి రెండు .. మూడు స్టోరీ లైన్స్ వినిపించాడట. అందులో 'సమ్మోహనం' లైన్ కూడా ఉందని అంటున్నారు. అయితే ఇంద్రగంటి చెప్పిన ఆ లైన్ విన్న చైతూ, చేస్తానని గానీ .. చేయనని గాని చెప్పలేదట. అప్పటికే ఆయన 'సవ్యసాచి' .. 'శైలజా రెడ్డి అల్లుడు' ప్రాజెక్టులను ఒప్పుకుని ఉండటం వలన తన నిర్ణయాన్ని చెప్పలేకపోయాడని అంటున్నారు. 'సవ్యసాచి' కోసమే చైతూ 'సమ్మోహనం' ప్రాజెక్టును వదిలేశాడని మాత్రం ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఇంద్రగంటి మాత్రం త్వరలో చైతూతో ఓ సినిమా చేస్తానని అంటున్నాడు.  

More Telugu News