venkatesh: మల్టీ స్టారర్ కోసం రంగంలోకి దిగుతోన్న వెంకీ .. వరుణ్

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2'
  • వెంకీ సరసన తమన్నా 
  • వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్

కథలో కొత్తదనం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేసే వెంకటేశ్, ఈ కారణంగానే ఈసారి కొంత గ్యాప్ తీసుకున్నాడు. అనిల్ రావిపూడి వినిపించిన కథ నచ్చడంతో వెంటనే ఆయన ఓకే చెప్పేశారు. 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్న ఈ మల్టీ స్టారర్ మూవీలో మరో హీరోగా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు.

ఈ కాంబినేషన్ సెట్ అయిందనే వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందరూ ఎదురుచూస్తోన్న ఆ సమయం రానే వచ్చేసింది. రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.  

More Telugu News