kalyan dev: 'విజేత' నుంచి మాంచి మాస్ మసాలా సాంగ్

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
  • కథానాయికగా మాళవిక నాయర్ 
  • సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్  

చిరూ చిన్నల్లుడి మొదటి సినిమాగా 'విజేత' రూపొందింది. రాకేశ్ శశి దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా మాళవిక నాయర్ నటించింది. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. మురళీశర్మ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు.

 ఈ పాటలో ముందుగా చికెన్ లోని రకాలు చెప్పారు .. మాకు బలాన్ని ఇస్తూ బలైపోతావు .. శ్రద్ధాంజలి నీకు .. అంటూ కోడి ఫోటోకి దండేశారు. చికెన్ లవర్స్ అందరి కోసం అంటూ ఈ పాట మొదలవుతుంది. " కో .. కొక్కరోకో .. లిక్కరోకో .. ముక్కరోకో .. " అంటూ ఈ పాట జోరుగా కొనసాగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం ఆకట్టుకునేలా వున్నాయి. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్స్ మాస్ ఆడియన్స్ ను అలరించేవిగా వున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మాస్ సాంగ్ గా ఇది పాప్యులర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News