రచ్చరచ్చ చేస్తున్న కర్ణాటక ఎమ్మెల్యే ప్రియురాలు!

22-06-2018 Fri 10:41
  • వేడి పుట్టిస్తున్న రామదాసు ప్రియురాలు ప్రేమకుమారి
  • ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యక్షం
  • రామదాసే నా భర్త అంటూ మీడియాతో వెల్లడి
కర్ణాటక రాజకీయాల్లో ప్రేమకుమారి వేడి పుట్టిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రామదాసు ప్రియురాలిగా వార్తల్లోకి ఎక్కి, ఎన్నికల సమయంలో నానా హంగామా చేశారామె. తాజాగా, హఠాత్తుగా ఎమ్మెల్యే రామదాసు కార్యాలయంలో ఆమె ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రామదాసే తన భర్త అని చెప్పారు. బతికి ఉన్నంత కాలం రామదాసుతోనే కలిసి జీవిస్తానని తెలిపారు.

 ఎన్నికల్లో కూడా రామదాసు కోసమే పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత... రామదాసు తప్పించుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఆయనతో తాడోపేడో తేల్చుకోవడానికే వచ్చానని చెప్పారు. రామదాసుకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తానని హెచ్చరించారు. మైసూరు కృష్ణరాజ నియోజక వర్గానికి రామదాసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.