సై... 'రా' పాకిస్థాన్ అంటున్న భారత్... నేడు దుబాయ్ లో కబడ్డీ పోటీ!

- దుబాయ్ లో కబడ్డీ మాస్టర్స్ టోర్నీ
- ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇండియా
- నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్
ఆసియా క్రీడలకు ముందు ఈ టోర్నీలో విజయం సాధించి మానసికంగా బలపడాలని భారత్ భావిస్తోంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ లో పాక్, కెన్యా, భారత్ గ్రూప్- ఎలో ఉండగా, ఇరాన్, కొరియా, అర్జెంటీనా జట్లు గ్రూప్-బీలో ఉన్నాయి. అజయ్ ఠాకూర్ సారథ్యంలో భారత్ జట్టులో రాహుల్ చౌదరి, పర్దీప్ నర్వాల్, రోహిత్ కుమార్, రిషాంక్ దేవడిగ, మోను గోయత్, దీపక్ హుడా, మంజీత్ చిల్లర్, సురేందర్ నాడా, గిరీష్ ఎర్నాక తదితరులు ఉన్నారు. నేటి రాత్రి 8 గంటలకు జరగనున్న మ్యాచ్ ని స్టార్ స్పోర్ట్స్ చానల్ లో లైవ్ చూడవచ్చు.