gun: ఆటో డ్రైవర్‌కు గురిపెట్టి తుపాకీతో కాల్చిన అమ్మాయి.. తృటిలో తప్పించుకున్న వైనం.. వీడియో వైరల్

  • హరియాణాలోని గురుగ్రామ్‌లో ఘటన
  • పార్కింగ్‌ విషయంలో గొడవ 
  • రెచ్చిపోయిన యువతి

హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. సునీల్‌ అనే ఆటోడ్రైవర్‌తో గొడవ పెట్టుకుని తుపాకీ తీసి కాల్చింది. అతడు పరుగులు తీయడంతో తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రోడ్డు పక్కన తన ఆటోను నిలిపి ఉంచిన సునీల్‌ వద్దకు వచ్చిన స్వప్న అనే యువతి  తన వాహనాన్ని అక్కడే పార్క్‌ చేయాలని, ఆటోని పక్కకు జరపమని డిమాండ్ చేసింది.

అందుకు సునీల్ ఒప్పుకోకపోవడంతో గొడవ పెట్టుకుంది. స్వప్న భర్త, వారితో వచ్చిన మరో వ్యక్తి కూడా ఆటోడ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్వప్న తన వద్ద ఉన్న తుపాకీ తీసి కాల్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో బంధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వప్నతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.                                                                                                   

More Telugu News