Chandrababu: ఏపీకి సహకరించకపోతే.. కేసీఆర్ కే ఇబ్బంది: టీజీ వెంకటేష్

  • ప్రత్యేక హోదా పోరాటంలో చంద్రబాబుకు కేసీఆర్ మద్దతు ఇవ్వాలి
  • లేకపోతే తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లకు కేసీఆర్ ను ఓడించాలని పిలుపునివ్వాల్సి వస్తుంది
  • మోదీ వలలో కేసీఆర్ పడరాదు

రాష్ట్ర విభజనతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పోరాటానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలకాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు. కేసీఆర్ చేతులు కలపకపోతే ఆయనే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఏపీకి అన్ని విధాలా సహకరిస్తానని కేసీఆర్ చెప్పారని... ఒక ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటను ఆయన నిలుపుకోవాలని అన్నారు.

ఏపీ అభివృద్ధి విషయంలో కేసీఆర్ కలిసిరాకపోతే... కర్ణాటకలో జరిగిన విధంగా రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల ఓటర్లకు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. నీతి ఆయోగ్ సమావేశానికంటే ముందే ప్రధాని మోదీని కేసీఆర్ కలిశారని... ఆ తర్వాత సమావేశంలో ఏపీ గురించి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఇరు తెలుగు రాష్ట్రాలు ఒకే తాటిపై వెళతాయన్న సంకేతాలు ఇవ్వకపోతే... ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. మోదీ వలలో కేసీఆర్ పడకూడదని సూచించారు. 

More Telugu News