raj nath singh: జమ్ముకశ్మీర్ లో ఏం చేయనున్నారో స్పష్టం చేసిన రాజ్ నాథ్ సింగ్

  • టెర్రరిస్టు గ్రూపులన్నింటినీ తుడిచి పెట్టేస్తాం
  • రాష్ట్రంలో టెర్రరిస్టులు లేకుండా చేస్తాం
  • జమ్ముకశ్మీర్ లో శాంతి స్థాపనే ప్రధాన లక్ష్యం

రంజాన్ సందర్భంగా తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి నెల రోజుల పాటు విశ్రాంతినిచ్చిన భద్రతాబలగాలు... మళ్లీ ఏరివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కశ్మీర్ లో ఉన్న పాకిస్థాన్ ప్రేరేపిత టెర్రరిస్టు గ్రూపులన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేస్తామని తెలిపారు.

జమ్ముకశ్మీర్ లో తీవ్రవాదాన్ని సహించబోమని, తీవ్రవాదులందరినీ ఏరిపారేస్తామని చెప్పారు. తీవ్రవాదంతో అతలాకుతలమైన రాష్ట్రంలో మళ్లీ శాంతిని నెలకొల్పడమే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. టెర్రరిజానికి మోదీ ప్రభుత్వం ముగింపు పలకబోతోందని చెప్పారు. జమ్ముకశ్మీర్ లో మెహబూబా ముఫ్తీ పాలన ముగిసి, గవర్నర్ పాలన అమల్లోకి వచ్చిన గంటల వ్యవధిలోనే రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

More Telugu News