ntr: 'సిద్ధార్థ్ గౌతమ్' గాను కనిపించనున్న ఎన్టీఆర్!

  • ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ
  • డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్  
  • కథానాయికగా పూజా హెగ్డే  

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన 'వీరరాఘవ'గా కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ పాత్రలో ఎన్టీఆర్ రాయలసీమ యాసలోనే మాట్లాడటం .. సిక్స్ ప్యాక్ లో కనిపించనుండటం విశేషం. అయితే ఇదంతా జరిగేది సెకండాఫ్ లోనే. ఫస్టాఫ్ లో ఎన్టీఆర్ 'సిద్ధార్థ్ గౌతమ్' పేరుతో టెక్కీగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ గా .. కూల్ గా .. స్మార్ట్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ రెండు పాత్రల మధ్య గల వేరియేషన్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నారు.  

More Telugu News