dona: ట్రంప్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన పోప్ ఫ్రాన్సిస్

  • వలసదారులపై ట్రంప్ ప్రభుత్వ తీరు దారుణం
  • సమస్యకు ఇది పరిష్కారం కాదు
  • వాటికన్ సిటీ యంత్రాంగంలో ఎక్కువ మంది మహిళలు ఉండాలని కోరుకుంటున్నా

వలసదారులపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వ తీరును క్రైస్తవుల (క్యాథలిక్) మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తప్పుబట్టారు. మెక్సికో సరిహద్దుల్లో తల్లిదండ్రులు, పిల్లలను విడదీస్తుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వలసదారుల సమస్యకు ఇది పరిష్కారం కాదని అన్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేయడం క్యాథలిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, అనైతికమని ఇటీవల అమెరికాలోని క్యాథలిక్ బిషప్ లు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.

చైనాలో బిషప్ ల నియామకాలకు మార్గం సుగమమవుతుందని తాను ఆశిస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. వాటికన్ సిటీ ఉన్నతస్థాయి పరిపాలన యంత్రాంగంలో ఎక్కువ మంది మహిళలు ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 

More Telugu News