Hyderabad: హైదరాబాద్‌లో భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం?

  • ముషీరాబాద్‌లో ఘటన
  • విద్యార్థిని పేరు సనాగా గుర్తింపు
  • పెద్దపల్లి జిల్లా రొంపికుంటకు చెందిన సనా

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గంగపుత్రకాలనీలోని బీసీ హాస్టల్ ఉంటూ చదువు కొనసాగిస్తోన్న ఓ విద్యార్థిని అదే భవనంపై నుంచి దూకి కలకలం రేపింది. సదరు హాస్టల్ నిర్వాహకులు ఆమెను వెంటనే దగ్గరలోని గాంధీ ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఆ విద్యార్థిని పేరు సనా అని, ఆమెది పెద్దపల్లి జిల్లా రొంపికుంట అని పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.   

More Telugu News