Nara Lokesh: నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు: నారా లోకేశ్

  • సీఎం చంద్రబాబు సతీమణి, లోకేశ్ తల్లి భువనేశ్వరి బర్త్ డే నేడు 
  • హ్యాపీ బర్త్ డే నా సూపర్ హీరో, బెస్ట్ ఫ్రెండ్
  • అమ్మకు అంతులేని ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఏపీ మంత్రి నారా లోకేశ్ తన తల్లి భువనేశ్వరికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు సతీమణి, లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే నా సూపర్ హీరో, బెస్ట్ ఫ్రెండ్, నా శక్తికి మూలం, నాకు స్ఫూర్తి ..మా అమ్మ!! అమ్మకు అంతులేని ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ఆ ట్వీట్ లో లోకేశ్ పేర్కొన్నారు. 

More Telugu News