vijay: విజయ్ ఫస్టులుక్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది

  • మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ 
  • కథానాయికగా కీర్తి సురేశ్ 
  • దీపావళికి భారీస్థాయి విడుదల

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కి ఇది 62వ సినిమా .. ఇంతవరకూ ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మిగతా 20 శాతం చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. విజయ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తుండగా .. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను నిర్ణయించలేదు. దాంతో ఈ సినిమా టైటిల్ ఏమిటో తెలుసుకోవడం కోసం .. విజయ్ లుక్ ఎలా ఉంటుందో చూడటం కోసం అభిమానులంతా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రేపు సాయంత్రం 6 గంటలు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడానికి మురుగదాస్ రెడీ అవుతున్నాడు. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News