Jammu And Kashmir: కశ్మీర్‌లో భద్రతను పర్యవేక్షించనున్న జాతీయ భద్రతా దళాలు

  • రాత్రి 7.30 గంటలకు ఐబీ, రా అధికారులతో ఎన్‌ఎస్‌ఏ భేటీ
  • సైన్యాధికారులు కూడా హాజరు
  • అజిత్ దోవల్‌తోనూ చర్చించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

జమ్ముకశ్మీర్‌లో పీడీపీతో బీజేపీ బంధం తెంచుకోవడంతో ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో జాతీయ భద్రతా దళాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఐబీ, రా అధికారులతో ఎన్‌ఎస్‌ఏ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సైన్యాధికారులు కూడా హాజరవుతారు. కాగా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొద్ది సేపటి క్రితం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో చర్చలు జరిపారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిలో గవర్నర్‌కు సహకరించేందుకు ఓ అధికారిని పంపాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News