kadapa: కడప జిల్లాలో ఓ వ్యక్తిపై కత్తితో విచక్షణారహితంగా దాడి

  • కడప జిల్లా కలమల్లలో ఘటన
  • వివాహేతర సంబంధమే కారణం
  • ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

కడప జిల్లాలోని కలమల్లలో ఓబులేసు అనే వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో కిరాతంగా పొడిచి హత్య చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఓబులేసు తల, భుజం, కడుపు ప్రాంతాల్లో ఆ వ్యక్తి విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఓబులేసు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యకు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది.

More Telugu News