Arun Jaitly: ప్రజల్లో నిజాయతీ ఎక్కడుంది?: అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు

  • పన్నులు సక్రమంగా కట్టకపోవడం వల్లే 'పెట్రో' మంట
  • పెట్రోలు, డీజెల్ పై సుంకాలు తగ్గించేది లేదు
  • చిదంబరం చెప్పినట్టు చేస్తే మిగిలేది చిప్పే

భారతీయుల్లో నిజాయతీ లేదని, ప్రజలు సక్రమంగా పన్నులు కట్టకపోవడం వల్లే ఆదాయం కోసం పెట్రోలు, డీజెల్ తదితరాలపై భారీగా పన్నులు వేయాల్సి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేతనజీవులు మాత్రమే సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారని, మిగతా అన్ని వర్గాల వారూ నిజాయతీగా పన్ను కట్టడం లేదని ఆరోపించిన ఆయన, ప్రజలు ఎప్పుడైతే పన్నులను సక్రమంగా చెల్లిస్తారో, అప్పటి నుంచి పెట్రోలు రేట్లు దిగివస్తాయని అన్నారు. 'పెట్రో' ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించే పరిస్థితి లేదని చెబుతూ, తన ఫేస్ బుక్ పేజీలో జైట్లీ ఓ వ్యాసాన్ని రాశారు.

మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చెప్పే మాటలు వింటే చివరికి చేతిలో చిప్ప మిగులుతుందని విమర్శించిన ఆయన, ఇంధన ధరలను లీటరుకు రూ. 25కు తగ్గిస్తే, భారతావని అప్పుల్లో కూరుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్ వారు తాము చేసిన తప్పులను ఇప్పుడు ఎన్డీయేతో కూడా చేయించాలని చూస్తున్నారని ఆరోపించిన జైట్లీ, పెట్రోల్, డీజెల్ పై ఒక్క రూపాయి వ్యాట్ తగ్గించినా, కేంద్రంపై రూ. 13 వేల కోట్ల భారం పడుతుందని, సంక్షేమానికి నిధులు తగ్గుతాయని అన్నారు.

More Telugu News