Chandimal: శ్రీలంక కెప్టెన్ చండీమల్ బాల్ ట్యాంపరింగ్ నిజమే.. చక్కర్లు కొడుతున్న వీడియో!

  • జేబులో చేయిపెట్టి ఏదో నోట్లో వేసుకున్న చండీమల్
  • బంతిని మరింత షైన్ చేసే ప్రయత్నం
  • టాంపరింగ్ ను బయటపెట్టిన వీడియో 

విండీస్‌తో జరుగుతున్న టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీలంక కెప్టెన్ చండీమల్ ఆ ఆరోపణలను ఖండించాడు. బోర్డు కూడా అతడికి అండగా నిలిచింది. తాను ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని చెప్పాడు. అయితే, అదంతా అబద్ధమేనంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. బంతిని తన చేతుల్లోకి తీసుకున్న చండీమల్ దాని ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. జేబులో నుంచి చేతిని బయటకు తీసిన తర్వాత ఏదో నోట్లో పెట్టుకున్నాడు. అనంతరం బంతిపై లాలాజలాన్ని రాస్తూ మరింత షైన్‌గా చేయడానికి చండీమల్ ప్రయత్నించాడు.

కాగా, చండీమల్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు బంతిని మార్చడంతో శ్రీలంక ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అంపైర్ తీరును నిరసిస్తూ మైదానం వీడారు. దీంతో రెండు గంటల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. ఐతే, అంపైర్లతో పలు దఫాల చర్చల తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి రావడతో మ్యాచ్ కొనసాగింది.

More Telugu News