Andhra Pradesh: ఏపీ సర్కారు ఆదేశాలు పట్టించుకోని పాఠశాలలు... సెలవుల్లోనూ తెరచుకున్నాయి!

  • ఏపీలో మండుతున్న ఎండలు
  • సెలవులను పొడిగించిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు అందలేదంటున్న కొందరు అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్నందున పాఠశాలలకు మరో మూడు రోజుల పాటు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేయగా, ప్రైవేటు పాఠశాలలతో పాటు కొన్ని ప్రభుత్వ స్కూళ్లూ ఈ ఉదయం యథావిధిగా తెరచుకున్నాయి. సెలవులు పొడిగిస్తున్నట్టు నిన్న సాయంత్రం ఉత్తర్వులు వెలువరించగా, అవి అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకూ ఇంకా చేరలేదని సమాచారం.

ఈ కారణంతోనే పలు ప్రాంతాల్లో స్కూల్స్ నడుస్తుండగా, ఎండల్లో పిల్లలను ఎలా పంపుతామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిన్న ఏపీలోని చాలా ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తొలకరి వర్షాలు పడ్డప్పటికీ, ఆపై నైరుతి రుతుపవనాలు మందగించడంతోనే ఎండ ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు.

More Telugu News