Telangana: తెలంగాణలో పారా మెడిక‌ల్ కోర్సుల్లో సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివరాలు

  • వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం
  • ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ శిక్ష‌ణా సంస్థ‌ల్లో మొత్తం సీట్లు 33,871
  • ప్రస్తుతం పారా మెడిక‌ల్ కోర్సులకు అత్యంత ప్రాధాన్య‌త
  • www.tspmb.telangana.govt.in వెబ్ సైట్‌లో వివరాలు

తెలంగాణ ప్ర‌భుత్వం 2018-19 ఏడాదికి గానూ పారా మెడిక‌ల్ కోర్సుల సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వివిధ కోర్సుల్లో సీట్లు, ఆయా భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు సంబంధించిన తేదీల వివ‌రాల‌ను తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డు వెల్ల‌డించింది. ఆయా కోర్సుల్లో మొత్తం 33,871 సీట్లు ఉండ‌గా, అందులో ప్ర‌భుత్వ శిక్ష‌ణా సంస్థ‌ల్లో 591 సీట్లు, ప్రైవేట్ శిక్ష‌ణా సంస్థ‌ల్లో 33,280 సీట్లు ఉన్నాయి.

ప్ర‌భుత్వ శిక్ష‌ణా సంస్థ‌ల్లో ఆయా కోర్సులు సీట్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. డీఎంఎల్‌టీ-195, డీఎంఐటీ-45, డీఎఎన్ఎస్‌-110, డీసీఏఆర్‌డీఐఓ-26, డీసీఎల్‌టీ-12, డీఆర్‌జీఏ-28, డీడీఆర్ఏ-18, డీఈసీజీ-28, డీపీఈఆర్‌ఎఫ్‌యూ-20, డీఓఏ-32, డీఆర్‌టీటీ-10, డీఎంఎస్‌టీ-20, డ‌యాలిసిస్‌-20, డీఓఎం-17, డీఆర్ఈఎస్‌టీ-10 సీట్లు కాగా మొత్తం సీట్లు 591.

వీటి ముఖ్య తేదీల వివరాలు చూస్తే.. 18-06-2018న నోటిఫికేష‌న్ విడుద‌ల‌. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ఆఖ‌రు తేదీ 09-07-2018. ఆ తరువాత 20-07-2018 తేదీ నాటికి కౌన్సిలింగ్ పూర్తి చేసి, అభ్య‌ర్థుల ఎంపిక‌ను పూర్తి చేస్తారు. 30-07-2018 లోగా అభ్య‌ర్థుల ఎంపిక జాబితాల‌ను తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డుకి పంపించాల్సి ఉంటుంది. తేదీ 07-08-2018 నుంచి క్లాసులు ప్రారంభమ‌వుతాయి.

ప్రైవేట్‌ శిక్ష‌ణా సంస్థ‌ల్లో ఆయా కోర్సులు-సీట్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి...
డీఎంఎల్‌టీ-6765, డీఎంఐటీ-3136, డీఎఎన్ఎస్‌-1703, డీపీఈఆర్‌ఎఫ్‌యూ-606, డీసీఎల్‌టీ-238, డీఆర్‌జీఏ-2434, డీడీఆర్ఏ-191, డీఈసీజీ-1668, డీఓఏ-3108, డీఆర్‌టీటీ- 320, డీఎంఎఫ్ఎస్ఎం-149, డీఎంఎస్ అండ్ ఓటీటీ-2489. డీఏఎం-181, డ‌యాలిసిస్‌-656, డీఓఎం-1371, డీఆర్ఈఎస్‌టీ-175, డీఎంపీహెచ్ఏ-7760, డీడీహెచ్‌వై-40, డీడీటీ-55, డీఎంఎస్‌-12 డీహెచ్ఎల్ఎస్ టీ-30 సీట్లు, కాగా మొత్తం సీట్లు 33,280.

ముఖ్య తేదీల వివరాలు చూస్తే...  18-06-2018న నోటిఫికేష‌న్ విడుద‌ల‌. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ఆఖ‌రు తేదీ 12-07-2018. అనంతరం 24-07-2018 తేదీ నాటికి కౌన్సిలింగ్, అభ్య‌ర్థుల ఎంపిక‌ను పూర్తి చేస్తారు. 30-07-2018 లోగా అభ్య‌ర్థుల ఎంపిక జాబితాల‌ను తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డుకి పంపించాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్ కోటా అభ్య‌ర్థుల ఎంపిక‌ను తేదీ 01-08-2018లోగా పూర్తి చేయాలి. 04-08- 2018 లోగా ఎంపిక చేసిన అభ్య‌ర్థుల జాబితాల‌ను పారా మెడిక‌ల్ బోర్డుకు పంపించాలి. తేదీ 07-08-2018 నుంచి క్లాసులు ప్రారంభమ‌వుతాయి.
 
అర్హత వివరాలు..
ఇంట‌ర్మీడియ‌ట్ బైపీసీ/ఎంపీసీ పూర్తి చేసిన అభ్య‌ర్థులు మాత్ర‌మే ఈ కోర్సుల‌కు అర్హులు. మిగ‌తా కోర్సుల‌కు బైపీసీ/ఎంపీసీ అభ్య‌ర్థులు అందుబాటులో లేక‌పోతే, మిగ‌తా ఇంట‌ర్ కోర్సులు పూర్తి చేసిన అభ్య‌ర్థుల‌ను ఆయా సీట్ల భ‌ర్తీకి ప‌రిశీలిస్తారు. డీఆర్‌టీటీ కోర్సుకు మాత్రం బైపీసీ/ఎంపీసీ పూర్తి చేసిన అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హులు. ద‌ర‌ఖాస్తుల తేదీలు, అర్హ‌త‌లు, జ‌త ప‌ర‌చాల్సిన ప‌త్రాలు, పీజులు వంటి మిగ‌తా పూర్తి వివ‌రాల‌కు www.tspmb.telangana.govt.in వెబ్ సైట్‌ చూడొచ్చ‌ని పారా మెడిక‌ల్ బోర్డు కార్య‌ద‌ర్శి టీ గోపాల్ రెడ్డి తెలిపారు.

అత్యంత ప్రాధాన్య‌మున్న కోర్సులు..
వైద్య రంగంలో వైద్యులు, ఫార్మాసిస్టులు, న‌ర్సుల త‌రువాత అత్యంత ప్రాధాన్య‌మున్న కోర్సులు పారా మెడిక‌ల్ కోర్సులు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత పెంచిన స‌దుపాయాలు, ఆధునిక వ‌స‌తులు, నానాటికి పెరుగుతున్న ఓపీ, ఐపీ సేవ‌ల నేప‌థ్యంలో పారా మెడిక‌ల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ల అవ‌స‌రాలు పెరిగాయి. ప్ర‌స్తుత త‌రుణంలో పారా మెడిక‌ల్ కోర్సుల‌కు ఇంజ‌నీరింగ్ వంటి మిగ‌తా కోర్సుల మాదిరిగా టెక్నిక‌ల్ కోర్సులు కావడంతో మంచి డిమాండ్ ఉందని గోపాల్‌రెడ్డి వివ‌రించారు. ఈ కోర్సుల‌ను అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు సద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

More Telugu News