Arvind Kejriwal: ధర్నా చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎవరు అనుమతిచ్చారు?: ప్రశ్నించిన హైకోర్టు

  • ఒకరి కార్యాలయంలోకి వెళ్లి దీక్ష చేయడం కుదరదు
  • పిటిషన్ పై విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య
  • మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రులు ధర్నాలో కూర్చునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని ఢిల్లీ హైకోర్టు ఈ రోజు ప్రశ్నించింది. ఢిల్లీ ప్రభుత్వ పాలనను కేంద్రం అడ్డుకుంటోందని నిరసిస్తూ సీఎం కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ బృందం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఏడు రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఈ రోజు విచారణ నిర్వహించింది.

‘‘మీరు ధర్నాలో కూర్చున్నారు. ఈ విధంగా దర్నా చేసేందుకు ఎవరు అనుమతించారు? దీన్ని దీక్ష అనరు. ఒకరి కార్యాలయం లేదా నివాసంలోకి వెళ్లి ధర్నా చేయడం కుదరదు’’ అని కోర్టు పేర్కొంది. మరోవైపు కేజ్రీవాల్ వెంట కూర్చున్న మంత్రుల్లో సత్యేంద్ర జైన్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రెండో రోజు నుంచి నిరాహార దీక్షచేపట్టగా, సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయన్ను ఎల్ఎన్ జేపీ ఆస్పత్రికి తరలించారు. 

More Telugu News