Chandrababu: చంద్రబాబు ప్రతిపాదన, డిమాండ్ లకు మద్దతు తెలిపిన మమత, నితీష్ కుమార్

  • 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాలన్న చంద్రబాబు
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్
  • విభజన హామీలను ఏకరువు పెట్టిన సీఎం

ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు కొన్ని రాష్ట్రాలకు తీరని నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని, ఈ నేపథ్యంలో విధివిధానాలను మార్చాలని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబు డిమాండ్ ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్థించారు. ఏపీతో పాటు, బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కేంద్ర వైఖరిని చంద్రబాబు నిలదీశారు. విభజన హామీలనన్నింటినీ ఆయన వరుసగా ఏకరువు పెట్టారు. ఇచ్చిన హామీలను కేంద్రం ఎందుకు నెరవేర్చలేకపోయిందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

More Telugu News