whatsapp: వాట్సాప్ చెల్లింపులను పరీక్షిస్తున్న పది లక్షల మంది... ఫీడ్ బ్యాక్ బాగుందన్న కంపెనీ

  • సందేశాలను పంపించినంత సులభంగా డబ్బుల్ని పంపుకోవచ్చు
  • మరింత మందికి సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
  • కంపెనీ ప్రతినిధి వెల్లడి... త్వరలోనే యూజర్లు అందరికీ అవకాశం!

వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన చెల్లింపుల సేవల్ని దేశంలో సుమారు పది లక్షల మంది వరకు యూజర్లు పరీక్షిస్తున్నారు. యూజర్ల నుంచి మంచి సానుకూల స్పందన ఉందని, మెస్సేజ్ లు పంపించినంత సులభంగా, భద్రంగా డబ్బుల్ని పంపుకోవచ్చని వాట్సాప్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

 మరింత మంది యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం, ఎన్ పీసీఐ, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పేటీఎం, గూగుల్ తేజ్, తదితర  చెల్లింపుల సేవలకు పోటీగా వచ్చిందే వాట్సాప్ పేమెంట్స్. గత కొన్ని నెలలుగా ఇది బీటా టెస్టింగ్ (అభివృద్ధి అనంతరం పరీక్షల దశలో) లో ఉంది. అధికారికంగా ప్రారంభించలేదు. వచ్చే కొన్ని వారాల్లో అధికారికంగా వాట్సాప్ తన పేమెంట్ సర్వీస్ ను ఆరంభించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

More Telugu News