Jammu And Kashmir: రంజాన్ ముగియడంతో కాల్పుల విరమణకు స్వస్తి... జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదుల వేట

  • నిర్ణయం తీసుకున్న కేంద్ర హోం శాఖ
  • ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు మళ్లీ ప్రారంభించాలని ఆదేశం
  • రంజాన్ సందర్భంగా మే 17 నుంచి కాల్పుల విరమణ

రంజాన్ మాసం కావడంతో నెల రోజుల పాటు కాల్పుల విరమణను పాటించిన భారత్ దానికి ముగింపు పలికింది. రంజాన్ ప్రారంభం నుంచి జమ్మూ కశ్మీర్లో కార్యకలాపాలపై విధించిన నిషేధాన్ని కొనసాగించరాదని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.  

‘‘రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్లో దాడులకు దిగవద్దని మే 17న భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి కోరుకునే ప్రజల ఆకాంక్షల కోణంలో, రంజాన్ మాసంలో అనుకూల వాతావరణం ఉండేందుకు అలా నిర్ణయం తీసుకున్నాం. ఉగ్రవాద దాడులు, హింస, మారణకాండను నిరోధించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని తిరిగి భద్రతా బలగాలను ఆదేశించాం. ఉగ్రవాద, హింసాత్మక చర్యల్లేని రాష్టంగా జమ్మూ కశ్మీర్ ను మార్చేందుకు కేంద్రం కట్టుబడి ఉంది’’ అని కేంద్ర హోంశాఖ తెలిపింది.

More Telugu News