Tamilnadu: కోర్టు తీర్పును హేళన చేసి, చిక్కుల్లో పడ్డ నటి కస్తూరి!

  • తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు
  • తీర్పుపై స్పందిస్తూ 'ఒంబోదు' అన్న పదాన్ని వాడిన కస్తూరి
  • తీవ్ర నిరసనలకు దిగిన హిజ్రాలు

తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హేళన చేస్తూ స్పందించిన దక్షిణాది సీనియర్ నటి కస్తూరి ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆమెపై పోలీసు కేసు నమోదైంది. మూడు రోజుల క్రితం అనర్హత కేసులో తీర్పు వెలువడగా, తమిళంలో హిజ్రాలను సంబోధించే 'ఒంబోదు' అన్న పదాన్ని వాడుతూ కస్తూరి ఓ ట్వీట్ పెట్టింది.

కోర్టు తీర్పు అటూ ఇటూ కానిదన్న అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలపై హిజ్రాలు భగ్గుమన్నారు. మైలాపూర్ లోని ఆమె ఇంటి ఎదుట తీవ్ర నిరసన తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము కూడా సగటు మనుషులమేనన్న సంగతిని కస్తూరి మరచిందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని హిజ్రాల సంఘాలు డిమాండ్ చేశాయి. హిజ్రాలు ఇచ్చిన ఫిర్యాదుపై మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కస్తూరిపై కేసు నమోదైంది.

More Telugu News