YSRCP: రాంమాధవ్ ఇంటి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఎయిర్ పోర్టులో దింపింది నేనే!: ఏపీ భవన్ కారు డ్రైవర్

  • నా కారులోనే వారిద్దరినీ షంగ్రిల్లాలో దింపా
  • మధ్యాహ్నం మూడు గంటలకు బుగ్గన ఫోన్ చేశారు
  • రాంమాధవ్ ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లా

ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలను గురువారం తన కారులోనే విమానాశ్రయానికి తీసుకెళ్లినట్టు ఏపీ భవన్ డ్రైవర్ వెల్లడించాడు. ఢిల్లీలో బీజేపీ-వైసీపీ నేతలు కలవడం తీవ్ర చర్చనీయాంశమైన వేళ డ్రైవర్ ఓ తెలుగు పత్రికతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. తన పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆయన.. ఢిల్లీలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ నివాసం నుంచి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గనను తానే ఎయిర్‌పోర్టులో దింపినట్టు స్పష్టం చేశాడు.

తన కారులోనే వారు హోటల్ షంగ్రిల్లాకు వెళ్లారని, అక్కడి నుంచి మిత్రులతో కలిసి ప్రైవేటు కారులో వెళ్లారని డ్రైవర్ పేర్కొన్నాడు. వారద్దరినీ హోటల్ వద్ద దింపిన తర్వాత తాను వెనక్కి వచ్చినట్టు చెప్పాడు. మళ్లీ మధ్యాహ్నం మూడు గంటలకు బుగ్గన తనకు ఫోన్ చేసి రాం మాధవ్ ఇంటికి రావాలని చెప్పడంతో వెళ్లానన్నాడు. అక్కడ ఆయనను ఎక్కించుకుని విమానాశ్రయంలో దింపినట్టు వివరించాడు. తన కారులోని జీపీఎస్‌లో తానెక్కడికి వెళ్లింది మొత్తం వివరాలు నమోదు అయి ఉంటాయని స్పష్టం చేశాడు.

More Telugu News