Jana Reddy: బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సహా చాలా హామీలు నెరవేరలేదు: జానారెడ్డి

  • రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర సర్కారు హామీలిచ్చింది
  • వాటిల్లో కొన్ని మాత్రమే అమలు చేశారు
  • తెలంగాణ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెరవేరలేదు
  • కేసీఆర్‌ నిలదీయట్లేదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర సర్కారు తెలంగాణకు పలు హామీలు ఇచ్చిందని, వాటిల్లో ఒకట్రెండు మాత్రమే అమలు చేశారని అన్నారు. తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనకబడిన ప్రాంతాలకు రాయితీలు వంటివి నెరవేరలేదని విమర్శించారు.

కేంద్ర సర్కారుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలదీయట్లేదని జానారెడ్డి అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో  కేసీఆర్ మాట్లాడలేదని అన్నారు. రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయాలను ప్రస్తావించాలని అన్నారు.                          

More Telugu News