Telangana: తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ మృతి

  • కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్న కేశవ్ రావు
  • బర్కత్ పురాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి
  • శివం రోడ్డులోని నివాసానికి మృతదేహాం తరలింపు

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ (86) మృతి చెందారు. కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని బర్కత్ పురాలోని బ్రిస్టిల్ కెన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆయన కన్నుమూశారు. కేశవరావు మృతదేహాన్ని శివం రోడ్డులోని ఆయన నివాసానికి తరలించారు.

కాగా, హైదరాబాద్ లోని హుస్సేని ఆలంలో 1933, జనవరి 27న ఆయన జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో, జై తెలంగాణ పోరాటంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ తెలంగాణ జేసీసీ ద్వారా జయశంకర్, కోదండరామ్ తో కలిసి ఆయన పని చేశారు.

 తొలి తెలంగాణ ఉద్యమంలో జాదవ్ 17 సార్లు అరెస్టై, దాదాపు రెండేళ్లు జైలు జీవితం గడిపారు. తెలంగాణ జన పరిషత్ కు కన్వీనర్ గా, మానవ హక్కుల ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, కుల ఉద్యమాలు, నక్సలైట్ పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు.   

More Telugu News