manisharma: నన్ను గురువుగా ఒప్పుకోనవసరం లేదు .. తిట్టకుండా వుంటే చాలు: సంగీత దర్శకుడు మణిశర్మ

  • పెద్ద హీరోల సినిమాలకి పనిచేశాను 
  • ఎవరి కెరియర్లోనైనా ఒడిదుడుకులు సహజం 
  • నా కెరియర్లోను అవి వున్నాయి    

తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త బాణీలను పరిచయం చేస్తూ మణిశర్మ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం గట్టిపోటీ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తనవైన బాణీలతో ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తూనే వున్నారు. తన మార్కు సంగీతంతో  హుషారెత్తిస్తోన్న ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"సంగీత దర్శకుడిగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో నేను చిత్రపరిశ్రమకి వచ్చినప్పుడు, నాకు మొదటిసారిగా అవకాశం ఇచ్చినది అశ్వనీదత్ గారు. అందువలన ఆయనని దైవసమానుడిగా భావిస్తూ వుంటాను. ఆ తరువాత చాలా సినిమాలకి పనిచేశాను. దాదాపు అగ్రహీరోలందరి సినిమాలకి సంగీతాన్ని అందించాను. నా దగ్గర చాలామంది పనిచేశారు .. వాళ్లలో కొంతమంది అంతా తామే చేసినట్టుగా చెప్పుకుంటూ వుంటారు. నన్ను గురువుగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు .. తిట్టకుండా వుంటే అంతే చాలు. ఇక ఎవరి కెరియర్లోనైనా ఒడిదుడుకులు సహజమే. అలాగే నా కెరియర్లోను నేను వాటిని చూశాను" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.         

More Telugu News