goa: అమెరికా నుంచి వచ్చిన వెంటనే పాలన మొదలు పెట్టిన గోవా సీఎం పారికర్

  • మూడు నెలల పాటు అమెరికాలో చికిత్స
  • నిన్న గోవా రాజధాని పనాజికి తిరిగి వచ్చిన పారికర్
  • ఈ రోజు ఇష్టదైవాలను దర్శించుకున్న అనంతరం విధుల్లో చేరిక

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (62) అమెరికాలో చికిత్స అనంతరం గురువారం పనాజికి తిరిగి రాగా, మరుసటి రోజే పాలన మొదలు పెట్టేశారు. ఈ రోజు ఉదయం పనాజికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవకి కృష్ణ మందిరాన్ని దర్శించుకున్నారు. పారికర్ కుటుంబానికి ఈ స్వామి ఆరాధ్య దైవమని సీఎం కార్యాలయం తెలిపింది.

 ఇక ఆ తర్వాత  తన నివాసం సమీపంలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై శాంతి, భద్రతల గురించి సమీక్షించారు.  పాంక్రియాస్ సంబంధిత సమస్యతో పారికర్ బాధపడుతుండగా, మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అమెరికా వెళ్లారు. మార్చి 7న అమెరికా వెళ్లగా, మూడు నెలల చికిత్స తర్వాత నిన్న తిరిగొచ్చారు.  తాను లేని సమయంలో పాలన కోసం ఆయన కేబినెట్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు.

More Telugu News