కనిపించని నెలవంక... రంజాన్ రేపే!

15-06-2018 Fri 08:43
  • గురువారం కనిపించని నెలవంక
  • శనివారం రంజాన్ జరుపుకోవాలి
  • ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాన్ ప్రకటన

గురువారం నాడు దేశవ్యాప్తంగా ఎక్కడా నెలవంక కనిపించకపోవడంతో, రంజాన్ పర్వదినాన్ని శుక్రవారం నాడు కాకుండా, శనివారం నాడు జరుపుకోవాలని ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ ఒక ప్రకటనలో తెలిపారు. నెలవంకను పరిశీలించి, రంజాన్ తేదీని నిర్దారించే కమిటీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

"గురువారం నాడు నెలవంక దర్శనం కాలేదు. అంటే, ఈద్ ను శుక్రవారం బదులుగా శనివారం నాడు జరుపుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కేరళలో మాత్రం నేడే రంజాన్ పండగను జరుపుకుంటున్నారు. నిన్న కోజికోడ్ లో నెలవంక కనిపించిందని ఇక్కడి ముస్లిం మత పెద్దలు స్పష్టం చేశారు. 12 నెలల ఇస్లామ్ క్యాలెండర్ లో ఒక్కో నెల 29 లేదా 30 రోజులు ఉంటుంది. రంజాన్ 9వ మాసం తరువాత షవ్వాల్ నెలలోని తొలిరోజున రంజాన్ పండగను జరుపుకుంటారు.