Neil Armstrong: చంద్రుడిపై ధూళిని చిన్నారికి కానుకగా ఇచ్చిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.. అది తమదే అంటున్న నాసా!

  • లారా అనే అనే మహిళకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కానుక
  • అప్పుడు ఆమె వయసు 10 ఏళ్లు
  • మూన్ డస్ట్ ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న నాసా

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాపై సిన్సినాటి నగరానికి చెందిన లారా అనే మహిళ అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు వేసింది. చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడైన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తనకు కానుకగా ఇచ్చిన 'చంద్రుడిపై ధూళి'ని నాసా తమ నుంచి తీసుకోకుండా చూడాలని తన పిటిషన్ లో లారా కోరారు. తన తండ్రికి ఆర్మ్ స్ట్రాంగ్ స్నేహితుడని తెలిపారు. లారా తండ్రి టామ్ ముర్రే అమెరికన్ ఆర్మీలో పైలట్ గా పని చేశారు. ఆర్మ్ స్ట్రాంగ్, టామ్ ఇద్దరూ చాలా కాలం పాటు కలిసి పని చేశారు.

ఈ నేపథ్యంలో, 1970లలో చంద్రుడి ధూళితో కూడిన ఒక చిన్న సీసాను, చేతి రాతతో ఉన్న ఒక నోట్ ను కూడా చిన్నారి లారాకు ఆర్మ్ స్ట్రాంగ్ కానుకగా ఇచ్చారు. అప్పుడు లారా వయసు 10 ఏళ్లు. ఇప్పుడు ఆ చంద్రుడి ధూళిని నాసా తీసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆమె తరపు లాయర్ తెలిపారు. అంతరిక్షానికి సంబంధించిన వస్తువులను ప్రైవేట్ వ్యక్తుల నుంచి నాసా తీసుకుంటోందని చెప్పారు. చట్ట ప్రకారం చంద్రుడికి సంబంధించిన ధూళిని లారా నుంచి తీసుకునే హక్కు నాసాకు లేదని తెలిపారు. మూన్ డస్ట్ కు సంబంధించి లారానే యజమానురాలని చెప్పారు. 

More Telugu News