sudheer babu: అలా హిట్ మూవీ చేజారిపోయింది: సుధీర్ బాబు

  • ఇంద్రగంటితో నా రెండో మూవీ చేయాల్సింది 
  • ఆ సినిమాకి అవసరాల స్క్రిప్ట్ అందించాడు 
  • కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది  

సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన 'సమ్మోహనం' .. రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ తో సుధీర్ బాబు బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక హిట్ మూవీ తన చేజారిపోయిందని చెప్పాడు.

"నా మొదటి సినిమా 'ఎస్సెమ్మెస్' విడుదలకు వారం రోజుల ముందుగా నేను రెండో సినిమాకి సైన్ చేశాను. ఆ సినిమాకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడైతే .. స్క్రిప్ట్ ను అందించినది అవసరాల శ్రీనివాస్. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు  ఆగిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేసి, దర్శకుడిగా ఆ సినిమాను అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించాడు. ఆ సినిమాయే 'ఊహలు గుసగుసలాడే' .. నాగశౌర్య - రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలా ఒక మంచి సినిమా చేజారిపోయింది" అని చెప్పుకొచ్చాడు.     

More Telugu News