nannapaneni: హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ ను నిషేధించాలి: నన్నపనేని రాజకుమారి

  • ఈ విషయమై కోర్టుకు వెళతా 
  • ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తా
  • మద్యపానం వల్లే మహిళలపై అకృత్యాలు పెరిగాయి

హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ ను నిషేధించాలని కోరుతూ కోర్టుకు వెళతానని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల దృశ్యాలను నిరోధించడానికి కృషి చేస్తామని, మద్యపానం వల్లే మహిళలపై అకృత్యాలు పెరిగాయని, వీటి అమ్మకాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా చట్టాలపై అవగాహన పెంచే నిమిత్తం సదస్సులు నిర్వహిస్తామని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు.

More Telugu News