charan: యాక్షన్ సీన్స్ చేస్తోన్న చరణ్ .. త్వరలో యూరప్ కి!

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్
  • ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • త్వరలోనే ఫస్టులుక్ రిలీజ్  

బోయపాటి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంత చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. చరణ్ కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. 15 రోజులపాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్లో, కొన్ని ఫ్యామిలీ సీన్స్ ను కూడా చిత్రీకరించనున్నారు.

ఆ తరువాత ఈ సినిమా టీమ్ యూరప్ కి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ మేజర్ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను .. పాటలను షూట్ చేయనున్నామని అంటున్నారు. యూరప్ లో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి .. ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో బోయపాటి వున్నాడట. చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నట్టు వార్తలు షికారు చేస్తుండటంతో, మెగా అభిమానులంతా ఫస్టులుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

More Telugu News