blood donation: ఈ సమస్యల్లో ఏది ఉన్నా రక్తం దానం చేయకూడదు!

  • జలుబు, ఫ్లూ ఉంటే దూరంగా ఉండాలి
  • రక్త సంబంధిత సమస్యలున్నా సరే
  • యాంటీబయోటిక్స్ వాడితే విరామం అవసరం

రక్త దానం చేసిన వారికి ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతుంటారు. రక్త దానం వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. మానవతా స్ఫూర్తితో రక్తదానం చేయాలనుకునేవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఈ సమస్యల్లో ఏది ఉన్నా కానీ రక్తం దానం చేయకూడదంటున్నారు వైద్యులు. నేడు రక్తదాన దినోత్సవం సందర్భంగా వాటిని తెలుసుకుందాం...

  • గత ఏడు రోజుల్లోపు యాంటీబయోటిక్స్ కోర్సు వాడి ఉంటే లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ తో గత రెండు వారాలుగా బాధపడుతుంటే మాత్రం రక్తదానం కోసం వెళ్లకండి.
  • ఫ్లూ, జలుబు, గొంతు మంట ఉన్న వారు రక్తదానం చేయవద్దు.
  • ఇటీవలి కాలంలో అంటే నాలుగు నెలల్లోపు టాట్టూ, కాస్మెటిక్స్ ట్రీట్ మెంట్ తీసుకుని ఉంటే, చర్మంపై సూదులతో పొడిచి చేసే ఏ చికిత్స తీసుకున్నా గానీ, రక్తాన్ని దానం చేయకూడదు.
  • హీమోఫీలియా, థలసేమియా లేదా మరే రక్త సంబంధిత సమస్యతో బాధపడుతున్నా గానీ రక్తాన్ని ఇవ్వకూడదు.
  • హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వ్యాధి ఉన్నా, హెపటైటిస్ వైరస్ ఉన్నవారు రక్తదానానికి దూరంగా ఉండాలి.
  • ఇక పాలిచ్చే తల్లులు, ఇటీవలే అబార్షన్ అయిన వారు కూడా రక్తదానానికి ముందుకు వెళ్లకూడదు.

More Telugu News