Apoorva: నన్ను కాల్ గర్ల్ గా చూపుతూ రూ. 40 వేలు వెల కట్టారు: పోలీసులకు నటి అపూర్వ ఫిర్యాదు

  • అపూర్వ ఫిర్యాదుతో కదిలిన డొంక
  • పోలీసుల అదుపులో మాజీ ప్రిన్సిపాల్
  • హీరోయిన్లతో పాటు కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా
  • ఫొటోలు చూసి డబ్బులు చెల్లించిన విటులు

ఆన్ లైన్ మాధ్యమంగా తెలుగు సినిమా మహిళా నటుల ఫొటోలు పెట్టి, వారితో గడిపేందుకు వెలకట్టి, పోలీసులకు చిక్కిన చొక్కారపు గణేష్ అనే మాజీ ప్రిన్సిపాల్ ఉదంతం టాలీవుడ్ లో తీవ్ర సంచలనం రేపుతుండగా, ఈ కేసు మొత్తం బయటకు రావడానికి కారణం సినీ నటి అపూర్వ. తన చిత్రాలను ఆన్ లైన్ లో పెట్టి రూ. 40 వేలు వెలకట్టారని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిలిన పోలీసులు ఈ కేసును ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గణేష్ పెట్టిన పోస్టింగ్స్ లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా ఉండటంతో, అవి ఎవరివన్న కోణంలోనూ పోలీసులు విచారణ ప్రారంభించారు.

కాగా, అపూర్వ తనపై ఫిర్యాదు ఇచ్చిన విషయాన్ని గురించి తెలుసుకున్న గణేష్, 'లొకాంటో' వెబ్ సైట్ లో పెట్టిన పోస్టింగ్స్, చిత్రాలన్నింటినీ డిలీట్ చేశాడని, ఇప్పుడు వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది. కేవలం హీరోయిన్ల ఫొటోలు చూపించి, విటుల నుంచి ఆన్ లైన్ మాధ్యమంగా గణేష్ రూ. 2 లక్షల వరకూ వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. గణేష్ బారిన పడిన వారి వివరాలు సేకరిస్తున్నామని, వారిని కూడా విచారిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. గణేష్ మొబైల్ ను సీజ్ చేశామని, అందులోని వివరాలు తమ విచారణకు కీలకమని వెల్లడించాయి.

More Telugu News