ఈ జనరేషన్ లో ఒకరిద్దరు కామన్... నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఉపేంద్రకు ముందే తెలుసు: మీడియాతో సోనూ శర్మ

14-06-2018 Thu 10:47
  • పాత బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ చేసింది ఉపేంద్రే
  • గత సంవత్సరం సెప్టెంబర్ లో వివాహం చేసుకున్నాడు
  • తప్పు చేశానని ఉపేంద్ర అంగీకరించాల్సిందేనన్న సోనూ

తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న సంగతి మయూరీ పాన్ షాపుల యజమాని ఉపేంద్ర వర్మకు ముందుగానే తెలుసునని, తనను ప్రేమించిన తరువాత అతన్ని పిలిపించి, సెటిల్ మెంట్ చేశాడని, ఉపేంద్ర చేతిలో మోసపోయానని ఆరోపిస్తున్న సోనూ శర్మ వ్యాఖ్యానించింది. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన సోనూ, తమకు సెప్టెంబర్ 2, 2017న వివాహం అయిందని చెప్పింది. ఉపేంద్రకు ఇంతకుముందే ప్రీతి అనే యువతితో వివాహం జరిగినట్టు తనకు తెలియదని చెప్పింది. ఉపేంద్ర తనకు ఎన్నడూ రూ. 40 లక్షలు ఇవ్వలేదని, తాను కోటి రూపాయలు డిమాండ్ చేశానని చేసిన అరోపణలు సైతం అవాస్తవమేనని చెప్పింది.

ఉపేంద్ర సోదరుడు మీడియాకు విడుదల చేసిన ఫోటోలను తానే గతంలో ఉపేంద్రకు చూపించానని, తన గురించిన అన్ని విషయాలూ అతనికి తెలుసునని చెప్పింది. ఉపేంద్ర తనను దారుణంగా మోసం చేశాడని, ఇప్పుడు తానేమీ అతనితో ఉండాలని కోరుకోవడం లేదని, చేసిన తప్పును అతను బహిరంగంగా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది. తన సోదరుడితో ఉన్న ఫొటోను సైతం అసభ్యంగా చూపిస్తున్నారని వాపోయింది. ఈ జనరేషన్ లో ఒకరిద్దరు అబ్బాయిలతో రిలేషన్ చాలా కామన్ అని, తనకూ ఉన్నాయని చెప్పుకొచ్చింది. కాలేజీ రోజుల్లో తనకున్న అఫైర్ గురించి నాలుగున్నర సంవత్సరాల క్రితమే ఉపేంద్రకు తెలుసునని వెల్లడించింది.