sai dharam tej: తేజు మూవీ కోసం ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్

  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో తేజు 
  • టైటిల్ గా 'చిత్రలహరి' ఖరారు 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్

సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'తేజ్ ఐ లవ్ యూ' చిత్రం సిద్ధమవుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై తేజు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లను కిషోర్ తిరుమల చకచకా పూర్తిచేస్తున్నాడు.

ఈ సినిమాకి 'చిత్రలహరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'చిత్రలహరి' అని టైటిల్ ను సాఫ్ట్ గా వదిలేయకుండా, కొంచెం కిక్ ఇచ్చేలా వుంటే బాగుంటుందని భావించారట. అందుకే ఈ టైటిల్ కి 'బార్ అండ్ రెస్టారెంట్ ' అనే ట్యాగ్ లైన్ ను తాజాగా జోడించారు. కథకి తగినట్టుగానే టైటిల్ .. ట్యాగ్ లైన్ సెట్ అయ్యాయని అంటున్నారు. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. యూత్ ను దృష్టిలో పెట్టుకునే కిషోర్ తిరుమల కథలను రెడీ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ కథను కూడా యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా ఆయన రెడీ చేశాడని చెబుతున్నారు.

More Telugu News