fathers day: తండ్రి అయిన వారికి భారత్ లో పితృత్వ సెలవుల్లేని పరిస్థితి: యునిసెఫ్ నివేదిక

  • తండ్రి అయిన వారికి వేతన చెల్లింపుతో కూడిన సెలవుపై చట్టాల్లేవు
  • భారత్ సహా 90 దేశాల్లో పరిస్థితి ఇంతే
  • భారత్ లో మూడు నెలల సెలవు ఇచ్చే చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు

తాను తండ్రిని అయ్యానన్న ఆనందాన్ని అనుభవించేందుకు వేతనం చెల్లింపుతో కూడిన పితృత్వ సెలవులు లేని దేశంగా భారత్ దేశాన్ని యునిసెఫ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ భాగ్యంలేని 90 దేశాల్లో భారత్ కూడా చోటు సంపాదించుకుంది. ప్రపంచంలో ఏడాదిలోపు వయసున్న చిన్నారుల్లో మూడింట రెండొంతులు ఈ 90 దేశాల్లోనే ఉన్నారని,  కొత్తగా తండ్రి అయిన వారికి ఒక్కరోజు అయినా వేతనంతో కూడిన పితృత్వ సెలవు ఇచ్చేందుకు ఈ దేశాల్లో చట్టాలు లేవని యునిసెఫ్ పేర్కొంది.

భారత్, నైజీరియాలో చిన్నారుల జనాభా ఎక్కువని, తమ చిన్నారులతో తగినంత సమయం గడిపేందుకు తండ్రులకు అవకాశం లేదని తెలియజేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కుటుంబ సన్నిహిత విధానాలు పెరిగిపోతున్నాయని, భారత్ లో కొత్తగా తండ్రి అయిన వారికి మూడు నెలల వేతనంతో కూడిన పితృత్వ సెలవు ఇచ్చేందుకు ప్యాటర్నిటీ బెనిఫిట్ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సభ ముందుంచే అవకాశం ఉందని యునిసెఫ్ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా సహా ఎనిమిది దేశాల్లో మాతృత్వ, పితృత్వ సెలవుల విధానం లేదని తెలియజేసింది.

More Telugu News