sammohanam: ‘సమ్మోహనం’ కోసం కాల్షీట్స్ సర్దుబాటు చేశా: అదితిరావు హైదరీ

  • ఈ కథ అద్భుతంగా ఉండటంతో వెంటనే ‘ఓకే’ చెప్పేశా
  • అయితే, కాల్షీట్స్ సమయం వచ్చిపడింది
  • నాకు కష్టమనిపించినా సర్దుబాటు చేసుకుని నటించా

తన దగ్గర కాల్షీట్స్ లేకపోయినా ‘సమ్మోహనం’ చిత్రం కోసం సర్దుబాటు చేసుకుని మరీ నటించానని అందాల భామ అదితిరావు హైదరీ చెప్పింది. ఈ చిత్రం ఎల్లుండి విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా కథను దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తనకు చెప్పినప్పుడు.. ఐదారు లైన్లలో వినేద్దామనుకున్నా కానీ, ఆ కథ చెప్పడం మొదలయ్యాక చిన్నపిల్లలా ఎంతో ఆసక్తితో విన్నానని చెప్పింది. ఈ కథ అద్భుతంగా ఉండటంతో వెంటనే ‘ఓకే’ చెప్పేశానని, అయితే, కాల్షీట్స్ సమస్య వచ్చిపడిందని చెప్పింది. తనకు కష్టమనిపించినా ఈ సినిమా కోసం సర్దుబాటు చేసుకుని నటించానని అదితి చెప్పింది.

More Telugu News