Donald Trump: కిమ్ తో సమావేశం ఆసక్తికరం..ఇకపై ఎలాంటి భయం లేదు!: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్

  • ‘లాంగ్ ట్రిప్ ముగించుకుని ఇప్పుడే అమెరికా చేరుకున్నా
  • ఇకపై ఉత్తర కొరియాతో మనకు ఎలాంటి ‘అణు’ భయం ఉండదు
  • రాత్రికి హాయిగా నిద్రపోండి

సింగపూర్ వేదికగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భేటీ జరిగిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం తన దేశానికి చేరుకున్న ట్రంప్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. కిమ్ తో భేటీ ఆసక్తికరంగా ఉందని, చాలా సానుకూలంగా జరిగిందని అన్నారు.

‘లాంగ్ ట్రిప్ ముగించుకుని ఇప్పుడే అమెరికా చేరుకున్నా. దేశాధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రతిఒక్కరూ ఎంత సురక్షితంగా ఫీలయ్యారో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సురక్షితంగా ఫీలవుతున్నారు. ఇకపై ఉత్తర కొరియాతో మనకు ఎలాంటి ‘అణు’ భయం ఉండదు. కిమ్ జాంగ్ ఉన్ తో భేటీ చాలా ఆసక్తికరంగా, సానుకూలంగా జరిగింది...

నేను అధ్యక్షుడిని కాకముందు ఉత్తర కొరియాతో మనకు యుద్ధం తప్పదని ప్రజలు అనుకునేవారు. ‘మనకు అతిపెద్ద, భయంకరమైన సమస్య  ఉత్తర కొరియా’ అని మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఇకపై ఆ సమస్య ఉండదు.. రాత్రికి హాయిగా నిద్రపోండి! ఇరువైపుల ఉన్న నమ్మకంతో జరిగే చర్చల ద్వారానే మన అదృష్టాన్ని కాపాడుకోగలుగుతాము తప్ప, యుద్ధ క్రీడలు చేయడం వల్ల కాదు’ అని తన ట్వీట్లలో ట్రంప్ పేర్కొన్నారు.

More Telugu News