Chandrababu: నాకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదు: విజయసాయిరెడ్డి

  • టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదు
  • చంద్రబాబు, లోకేష్ లపై విచారణ జరపాలి
  • జగన్ సీఎం అయ్యాక అవినీతి లెక్కలను తేల్చుతాం

తనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నోటీసులు పంపిందంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తనకు టీటీడీ నుంచి ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. నాలుగేళ్ల పాటు తాను టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నానని... ఏపీ ఎండోమెంట్ చట్టం కిందకు టీటీడీ వస్తుందని... అందులో ఉన్న ఒక చాప్టర్ ప్రకారం టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదని చెప్పారు. ఏదైనా సమాచారం కోసం వ్యక్తిని అభ్యర్థించగల హక్కు మాత్రమే టీటీడీకి ఉంటుందని తెలిపారు.

టీటీడీ ఆభరణాలను చంద్రబాబు దోచుకున్నారని, విదేశాలకు తరలించారని ఇటీవల విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ లపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వీరిద్దరూ నిర్దోషులని తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక మీ అవినీతి లెక్కలను తేల్చుతామని హెచ్చరించారు. 

More Telugu News