Deepika Padukone: ముంబయిలోని 45 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం.. అందులోనే దీపికా పదుకునే ఫ్లాట్‌!

  • వర్లి ప్రాంతంలో ఘటన
  • 33వ అంతస్తులో మంటలు
  • దెబ్బతిన్న పై అంతస్తులు

ముంబయిలోని వర్లి ప్రాంతంలో 45 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 33వ అంతస్తులో మంటలు చెలరేగడంతో దానిపై భాగంలో ఉన్న ఫ్లాట్‌లు కూడా దెబ్బతిన్నాయి. ఈ టవర్‌లోనే బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకుణె నివాసం ఉంటోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పుతున్నారు. 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్న విషయం తెలియాల్సి ఉంది. 

More Telugu News