Japan: జపాన్ లో ఇక 18 ఏళ్లకే పెద్దరికం... పార్లమెంటులో బిల్లుకు ఆమోదం!

  • 18 ఏళ్లు నిండితే ఇష్టానుసారం వివాహం
  • యువ జనాభాను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం పాట్లు
  • పెరిగిపోయిన వృద్ధుల సంఖ్యే కారణం

అడల్డ్ హుడ్ వయసును (యుక్తవయసు) 20 నుంచి 18 ఏళ్లకు మార్చే బిల్లుకు జపాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో, యువతను మరింత మందిని సమాజాభివృద్ధిలో పాలుపంచుకునేలా చేసేందుకు ఈ బిల్లు ద్వారా వీలు కల్పించారు. 2022 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 18 ఏళ్లు నిండిన వారు తల్లిదండ్రుల సమ్మతి లేకపోయినా పెళ్లి చేసుకునే హక్కులు ఇకపై లభిస్తాయి.

ఇన్నాళ్లూ 18 ఏళ్లు నిండిన అబ్బాయిలను,16 ఏళ్లు నిండిన అమ్మాయిలను పెద్దల అనుమతితో వివాహానికి ప్రస్తుతం అక్కడ అనుమతిస్తూనే ఉన్నారు. దేశంలో యవ సంతతిని పెంచడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే, మద్యపానం, పొగతాగడం, జూదంలో పాల్గొనడం వంటి వాటి విషయంలో 20 ఏళ్ల కనీస వయసు పరిమితి ఇక ముందూ కొనసాగుతుంది. ఇక ఓటు హక్కును 20 ఏళ్లకు బదులు 18 ఏళ్లకే కల్పించేందుకు గతంలోనే అక్కడి పార్లమెంటు ఆమోదం తెలియజేసింది.

More Telugu News